37.2 C
Hyderabad
April 19, 2024 10: 57 AM
Slider వరంగల్

విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ

#anurag

హన్మకొండ సుధార్ ఆశ్రయంలోని కాలేజీ విద్యార్ధులకు, స్పందన బధిరుల పాఠశాల విద్యార్ధులకు అనురాగ్  హెల్పింగ్ సొసైటి నోట్ పుస్తకాలను అందచేసింది. ఏడాదికి సరిపడా పుస్తకాలను అందించినట్లు అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యురాలు డా.అనితారెడ్డి తెలిపారు. పేద, అనాధ పిల్లలను విద్య లో ప్రోత్సాహం అందించాలని గత 28 సంవత్సరములుగా పిల్లలకు  పుస్తకాలు అందిస్తు న్నామని,  పేదరికము విద్యకు ఎటువంటి ఆటంకము కారాదని అనితా రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా అనితారెడ్డి  పిల్లల మంచి చెడులు అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల కేర్ అండ్ ప్రొటక్షన్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియచేయమని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పిల్లలకు అమ్మలా విద్య విలువని తెలిపి బాగా చదువుకోవాలని  చెప్పడం జరిగింది. అనంతరం జాతీయ వినియోగదారుల  హక్కుల  చట్టం పై అవగాహన కల్పించడం జరిగింది.

పిల్లలకు ప్రతి చట్టాల పై అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకోగలరని అనితారెడ్డి అన్నారు.  ఇక నుండి  ప్రజలకు వినియోగదారుల చట్టం పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలను చైతన్య పరుస్తూ సేవలను అందిస్తామని  అనితా రెడ్డి తెలిపారు.     

Related posts

సినీ పరిశ్రమ పెద్దలతో మంత్రి తలసాని సమావేశం

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Satyam NEWS

నల్లబజారుకు పేదవాడి రేషన్ బియ్యం

Satyam NEWS

Leave a Comment