కేంద్ర మాజీమంత్రి, న్యాయ కోవిదుడు ,ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇకలేరు. వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రి గా పనిచేసిన ఆయన చాలా కాలం బీజేపీలో అగ్రనేతగా ఉన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన పలు కేసు లను ఆయన వాదించారు. రాంజెఠ్మలానీ (95) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
previous post