28.7 C
Hyderabad
April 20, 2024 09: 25 AM
Slider సినిమా

వినాయక్ సీనయ్య ఫస్ట్ లుక్ విడుదల

pjimage (3)

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రానికి సీనయ్య అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు. వినాయక్ పుట్టినరోజు అక్టోబర్‌ 9న ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కానున్నది. పుట్టినరోజుకు తోడు విజయదశమి పండుగ ఘడియలు కూడా కలిసి వస్తుండటంతో కొత్త హీరో చిత్రానికి కొబ్బరికాయ కొడుతున్నారు. భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్‌ జిమ్‌లో చెమట చిందుస్తున్నాటడ. బరువు కూడా బాగా తగ్గుతున్నాడట. మరి హీరో గెటప్ రావాలి కదా. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈచిత్రంపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

Related posts

జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు అప్రజాస్వామికం

Satyam NEWS

వానలు కురువాలంటే.. మల్లయ్యకు జాతర చేయల్చిందే !!

Bhavani

సరెండర్:అసోంలో 644 మంది మిలిటెంట్ల లొంగుబాటు

Satyam NEWS

Leave a Comment