ప్రముఖ గాయకురాలు, ప్రెజంటర్ జగ్గీ జాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పలువురిని ఆశ్చర్య పరచింది. జగ్గీ జాన్ పాటలంటే కేరళలో చెవికోసుకుంటారు. పాప్, రాప్ మ్యూజిక్ తో శ్రోతల్ని పిచ్చెక్కించే జాకీ జాన్ ఆకస్మికంగా మరణించడం ఎందరికో బాధ కలిగించింది. తిరువనంతపురం ప్రాంతంలోని ఆమె ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె చనిపోయారు. కురవంకోణంలోని ఆమె ఇంట్లో తన తల్లితో కలిసి ఉండేది.
మృతదేహం ఇంటి వంటగది ప్రాంతంలో పడి ఉంది. సమాచారం అందడంతో పెరూర్కాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆమె అచేతనావస్థలో పడి ఉండటం చూసి తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. జగ్గీ జాన్ మోడలింగ్ పరిశ్రమలో కూడా చురుకుగా ఉండేవారు. ఆమె టివి షోలలో నిర్వహించే వంటల కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంది.