ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తప్పుడు వివరాలు సమర్పించిన చాలా మంది ఉద్యోగులను గుర్తించి నోటీసులు, ఎస్ఎంఎస్ పంపించామని ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ సుమిత పరిమట చెప్పారు. ఏటా ఆదాయ పన్ను వివరాలను జులై 31వ తేదీ వరకు సమర్పించాలన్నారు. ఐటీ ప్రాక్టీ షనర్స్ నమ్మి మోసపోవద్దని, సందేహాలు ఉంటే తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ప్రభు త్వానికి సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
చాలా మంది 500 ఉద్యోగులు పన్ను మినహాయింపు పొందేందుకు రిటర్నుల్లో తప్పుడు సమాచారం నమోదు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం చాలామంది 90 నుంచి 100 శాతం రిఫండ్ చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రేంజ్-5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన రిటర్నులు 14వేలు గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10,635 ఉన్నాయని తెలిపారు
ఆదాయ పన్ను రిఫండ్ కు అక్రమ మార్గాలను అనుసరించొద్దని, సక్ర మంగా పన్ను చెల్లించి దేశాభివృ ద్ధికి సహకరించాలని అన్నారు. శుక్ర వారం ఐ డి ఓ సి వనపర్తి కార్యాలయంలో ఉద్యోగులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు అంశం పై ఏర్పాటు చేసిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆమె జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ. మహారాష్ట్ర రాష్ట్రాల్లో 20 శాతం, 30 శాతం రిఫండ్ తీసుకుంటుంటే, రిపండ్ ఇప్పించి 5, 10 శాతం కమీషన్లు పొందేందుకు ఐటీ ప్రాక్టీషనర్లు తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారని, ఇలాంటివి పట్టుబడితే ఉద్యోగులే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.
ఉద్యోగులకు వచ్చే మూల వేతనం వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, పలు వురు తమ వేతనాలను తక్కువ వేసి రిటర్న్) ఫైల్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తప్ప వని పేర్కొన్నారు. బ్యాంకులు, రిజిస్ట్రేషన్ శాఖలో క్రయవిక్రయాల లావాదేవీలు, ఎలక్ట్రికల్, గృహోపక రణాలు, వాహనాల కోనుగోళ్లు, బీమా ప్రీమియం చెల్లింపులు తదితరాల వివరాలన్నీ ఎప్పటిక ప్పుడు తమకు అందుతూనే ఉంటాయని చెప్పారు. అక్రమంగా రిఫండ్ చేసిన సొమ్ముతో పాటు 1.30 వరకు వడ్డీ, 200 శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించారు 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో తప్పులు ఉంటే సవరించి మళ్లీ సమర్పించాలని సూచిం చారు. ఇందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ వర్క్ షాప్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆదాయ పన్ను శాఖ జిల్లా అధికారి మంగళవారపు మనోజ్ కుమార్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్