27.7 C
Hyderabad
April 24, 2024 10: 58 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ విడుదల

Ramesh kumar

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ నేడు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలివిడత షెడ్యూల్‌ను కూడా ఆయన విడుదల చేశారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి, 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

నేటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే: ఈనెల 9 నుంచి 11వరకూ నామినేషన్ల స్వీకరణ. మార్చి 12న నామినేషన్ల పరిశీలన. మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ. మార్చి 21న పోలింగ్‌. మార్చి 24 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే విధంగా మున్సిపల్‌ ఎన్నికల షెడ్యలు ఈ విధంగా ఉంది: మార్చి 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, మార్చి 27 ఫలితాలు వెలువడతాయి.

Related posts

కరోనా నుంచి కోలుకున్న డాక్టర్ మల్లు రవి

Satyam NEWS

ప్రజలపై మోయలేని భారం మోపిన ఘనత బీజేపి దే

Satyam NEWS

ట్రాజెడీ: ఈ చిట్టితల్లి పుట్టిన రోజే ఆఖరి రోజు

Satyam NEWS

Leave a Comment