36.2 C
Hyderabad
April 24, 2024 19: 06 PM
Slider పశ్చిమగోదావరి

త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు

#aallanani

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టులు భర్తీకి నోటిఫికెషన్స్ ఇచ్చి పారదర్శికంగా నియామకాలు జరగాలని అదేశించినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలు నుండి వినతులు స్వీకరించే కార్యక్రమంలో భాగంగా తంగేళ్లమూడికి చెందిన ఒక వికలాంగుడు ఉపాధి కోసం ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి ఆళ్ల నాని వికలాంగుడికి తంగేళ్లమూడి పంచాయతీలో ఉద్యోగం కల్పించడం కోసం సత్వరమే చర్యలు చేపట్టాలని AMC చైర్మన్ మంచెం మైబాబుకు సూచించారు.

మూడు చక్రాలు వాహనంలో క్యాంపు ఆఫీస్ కి వచ్చిన వికలాంగుడు ఒక్కడే కూర్చొని ఉండడాన్ని గమనించిన మంత్రి ఆళ్ల నాని ఆ వికలాంగుడు వద్దకు వెళ్లి ఆసక్తిగా అతను చేప్పిన వినతిని విని తప్పకుండా ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం తాను సహకారం అందిస్తానని చెప్పడంతో వికలాంగుడు సంతృప్తిగా వెనుతిరిగాడు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని దృఢ సంకల్పంతో చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగాలు కూడ వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ది పొందుతున్న విద్యార్థుల్లో అప్షన్స్ గా ఎంపిక చేసుకున్న వారికి ఒక లక్ష 10వేల 779ల్యాబ్ టాబ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంద చేస్తుందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Related posts

వైసీపీ రెడ్ల డిఎన్ఏ పార్టీ మాత్రమే, దళితులది కాదు

Bhavani

హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Satyam NEWS

జూమ్ యాప్ ద్వారా బ్రాహ్మణ వివాహ వేదిక

Satyam NEWS

Leave a Comment