27.7 C
Hyderabad
April 20, 2024 02: 49 AM
Slider ఆధ్యాత్మికం

న‌వంబ‌రు 29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

kartika-parva-deepotsavam

తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 29వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

Related posts

నవంబర్ 21 వరకు విద్యాసంస్థల మూత : సీఏక్యూఎం

Sub Editor

జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి అక్షింతలు

Satyam NEWS

Leave a Comment