24.2 C
Hyderabad
December 10, 2024 00: 33 AM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

నవంబరు 4న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

pushpayagam

కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరుగనుంది. నవంబరు 3న  పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణం కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన విశేష పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి.  పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.

Related posts

ఆదినారాయణ రెడ్డి పై కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఫైర్

Satyam NEWS

రాజధాని నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

Satyam NEWS

దేవగిరిపట్నంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment