27.7 C
Hyderabad
April 20, 2024 02: 30 AM
Slider జాతీయం తెలంగాణ

కమలం పైకి మళ్లుతున్న యురేనియం సెగలు

pjimage (12)

యురేనియం తవ్వకాలను నల్లమల ప్రాంత ప్రజలతో బాటు ఆంధ్రా తెలంగాణ ప్రజలంతా  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యురేనియం తవ్వకాలు ఆపకపోతే ఉద్యమం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉందనే ప్రచారం జరిగింది. టిఆర్ఎస్ పార్టీని జిల్లా ప్రజలు తప్పు పట్టారు. దాంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రజాగ్రహాన్ని చవి చూశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలేదని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదని స్పష్టం చేశారు.

అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదాం అనే మాటలు ఆయన చెప్పడంతో ఇప్పుడు అందరి చూపులు కేంద్రంపైకి మళ్లాయి. ఇప్పుడు ఇదే అంశాంపై యువత ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను, ప్రయోగాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే తగిన ఫలితాన్ని చూడాల్సి వస్తుందని ప్రజలు యువత సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. సేవ్ నల్లమల్ల అంటూ నినాదాలు చేస్తున్నారు. గత ఎన్నికలలో బిజెపి వైపు మళ్లిన ప్రజలు ఇప్పుడు యురేనియం గొడవతో బిజపికి వ్యతిరేకంగా మారుతున్నారు.

అందుకే యురేనియం  తవ్వకాల విషయంలో  కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. ప్రజలు రోడ్ల పైకిరావడం లేదుకాని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రజలు యువత సోషల్ మీడియా ద్వారా కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నారు. నల్లమల్ల ప్రజల జీవనోపాధిపై పొట్ట కొట్టే ప్రయాత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర  ప్రభుత్వం ఈ తవ్వకాలను ఆపకపోతే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అన్నిప్రజా సంఘాలు  వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర తీరుపై నిప్పులు చెరగుతున్నారు.

టీఆర్ఎస్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అందరం కలిసి కేంద్ర పోరాటం చేద్దాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలను ఆపకపోతే నల్లమల్ల ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అంటున్నారు. ఈ సమయంలో కేంద్రంఒక్కఅడుగువెన్నాకి వెయ్యకుంటే బీజేపీకి రాష్టంలో వ్యతిరేక పవనాలు వీచడం ఖాయంగా కనిపిస్తున్నది.

Related posts

అక్రమ దందాలు సాగిస్తున్న  విలేకర్లు అరెస్టు

Satyam NEWS

అటవీ భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం

Satyam NEWS

పీవీ ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌పంచానికి దిక్సూచీ

Sub Editor

Leave a Comment