20.7 C
Hyderabad
December 10, 2024 02: 04 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఇంత జరిగిన తర్వాత ఇప్పుడా మద్దతు ఇచ్చేది?

Kodela CBN

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బతికి ఉండగా సంఘీభావం ప్రకటించని చంద్రబాబునాయుడు ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత మాత్రం అసెంబ్లీ ఫర్నీచర్ పై వివరణ ఇస్తున్నారు. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ ను తీసుకెళ్లిన కేసు గురించి తెలుగుదేశం పార్టీ సమర్ధించదని ఆ పార్టీ నాయకుడు వర్ల రామయ్య తో చంద్రబాబునాయుడు చెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం కోడెల శివప్రసాదరావుకు చంద్రబాబునాయుడు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. “ఒక మంచి కుక్కను చంపాలంటే, పిచ్చికుక్క, పిచ్చి కుక్క అని ముద్ర వేసి, వెంటాడి, ఆ పిచ్చి కుక్కను పది మందీ కలిసి చంపే వరకూ వదిలిపెట్టకుండా ఏదైతే చేస్తారో… ఆ విధంగా కోడెల కేసులో జరిగింది. వేధించి, హింసించడం వల్ల మనిషి చనిపోతే ఏమనాలి?: అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఫర్నీచర్ ను ఎన్నడూ వాడలేదని చెప్పారు. తన భార్య అందుకు అంగీకరించలేదని అన్నారు. ఓ కుర్చీ కాదుగదా, ఓ గ్లాస్, లేదా నీళ్ల బాటిల్ ను కూడా తాను ఇంటికి తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వస్తువులను వాడటం భువనేశ్వరికి ఇష్టం ఉండదని అన్నారు. తన వద్ద ఉన్న ఫర్నీచర్ ను తీసుకువెళ్లాలని ప్రభుత్వం మారగానే కోడెల లేఖను రాశారని, ఆ తరువాత మరో లేఖను రాస్తూ, తానే తెచ్చివ్వాలని కోరినా, ఆ పని చేస్తానని చెప్పాడని చంద్రబాబు వెల్లడించారు. కోరితే, తన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల విలువను లెక్కగడితే, దాన్ని చెల్లిస్తానంటూ కొత్త స్పీకర్ కు సైతం లేఖను రాశారని అన్నారు. హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో వాడిన వస్తువులను, అమరావతిలో ప్లేస్ లేకనే, సత్తెనపల్లి, గుంటూరులోని కార్యాలయాలకు తరలించారే తప్ప, మరే విధమైన దురుద్దేశమూ లేదని అన్నారు. వాటిని కూడా తాను స్పీకర్ గా ఉంటూ, అఫీషియల్ యూజ్ కిందనే వాడానని లేఖ రాశారని అన్నారు. ఈ లేఖను కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం చూసి, దానిపై సంతకం పెట్టి, అకనాలడ్జ్ చేశారని చెబుతూ, చంద్రబాబు సదరు లేఖను చూపించారు. కానీ అధికారులే స్పందించలేదని ఆరోపించారు.

Related posts

ఏడవకు తల్లీ…. ఈ దరిద్రపు లోకం ఇలాగే ఉంటుంది….

Satyam NEWS

జర్నలిస్టు లకు న్యాయం చేస్తా: ఎమ్మెల్యే  మేడా హామీ

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

Satyam NEWS

Leave a Comment