33.2 C
Hyderabad
April 26, 2024 02: 43 AM
Slider విశాఖపట్నం

మళ్లీ మొదలు:విశాఖ అభివృద్ధికి రూ.394 కోట్లు

vizag development

విశాఖకు వివిధ అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు మంజూరు చేశారు. అందులో భాగంగా కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ. 22.50 కోట్లు కేటాయించారు. కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ. 37 కోట్లు కేటాయించారు.

సిరిపురం జంక్షన్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు మంజూరు చేశారు. నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రిసెర్చ్ సంస్థ కోసం రూ. 88 కోట్లు, నాతయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాని పాలెంలో రహాదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు కేటాయించారు. అదే విధంగా ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related posts

గుడ్ న్యూస్:కరోనా వైరస్ కు చైనా విరుగుడు మందు

Satyam NEWS

2 డోసుల టీకా లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రవేశం లేదు

Sub Editor

ఒకే రోజు లో ఎస్పీ బయట. ఏఎస్పీ ఆఫీసు లో విధుల నిర్వహణ…!

Bhavani

Leave a Comment