అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కారంపల్లె లో ఆదివారం ఎన్నారై కేకే రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ మైక్ సెట్ వితరణ గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై కేకే రెడ్డి కుమార్తె పెళ్లి పురస్కరించు కొని జన్మనిచ్చిన జన్మస్థలానికి రుణం తీర్చుకోడానికి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
పాఠశాలకు కంప్యూటర్, మైక్ సెట్ ఇవ్వడమే కాకుండా వేదిక నిర్మిస్తానని మరింత అభివృద్ధికి సహాయం చేస్తారని చెప్పడం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నారై కేకే రెడ్డిని గ్రామస్తులు మేళ తాళాల మధ్య, డప్పు వాయిద్యాలు,బాజా భజంత్రీలతో,కోలాటాలు, చెక్కభజనలు, గొబ్బెమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేకే రెడ్డి మాట్లాడుతూ తన పుట్టిన గ్రామం ఋణం తీర్చుకోలేనిదని, గ్రామ ప్రజల కోసం తాను ఏ దేశంలో ఉన్న తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
తన కుమార్తె సాయి మిత్ర,అల్లుడు మేఘదీప్ రిసెప్షన్ సందర్భంగా గ్రామస్తులు కానీ విని ఇరుగును రీతిలో తమ పట్ల చూపిన ప్రేమానురాగాలు మరువలేనిమన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఎన్నారై కేకే రెడ్డి తమ పాఠశాలకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తమ ప్రసంగంలో కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందలూరు రాజంపేట, ఒంటిమిట్ట, సిద్ధవటం ,సుండుపల్లె వీరబల్లె మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిన్నపు రెడ్డి,ఇంటాక్ సభ్యులు కొండారెడ్డి, నారాయణరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, మన్నూరు రామ లక్ష్మమ్మ,కార్య నిర్వహకులు శుభోదయ రెడ్డి, శివరామిరెడ్డి, గాలివీటి రాజేందర్ రెడ్డి, గాలివీటి భాస్కర్ రెడ్డి,గాలివీటి మదన్ రెడ్డి, భాస్కర్ రాజు, ఎంపీటీసీ బాబు, గాలివీటి వీర నాగిరెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, పెద్ద కారంపల్లి సర్పంచ్ అచ్చమ్మ, ఉప సర్పంచ్ వెంకట్రాజు, హైస్కూల్ ప్రధానోపాధ్యా యులు సుబ్ర హ్మణ్యం రాజు,విద్యా కమిటీ చైర్మన్ కే నాగ లత, మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.