ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన “పోషణ అభియాన్” పథకం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పోషక ఆహరం పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాల లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ గర్భిణీ స్త్రీలకు పళ్లను పంపిణి చేశారు. అంతే కాకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్ డా”ఆర్ .ప్రభాకర్ మాట్లాడుతూ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. ముఖ్యంగా ఆహరం లో పాలు, గుడ్లు, పండ్లు ఎక్కువ శాతం పోషకాలు కలిగిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని కోరారు. అదే మేరకు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయయానంద కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు జాతీయ సేవా పథకం క్రింద NSS వాలంటీర్లు, NSS సిబ్బంది కలిసి అవగాహనా సదస్సులు చేయడం ఆనంద దాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధి అధికారి డాక్టర్. జి . శంక ర య్య, సమన్వయకర్త డా ”ఉదయ్ శంకర్ అల్లం, విశ్వవిద్యాలయ పి . ఆర్ . ఓ డా ” నీలమణి కంఠ, అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయకర్త డా “క్రిరణ్మయీ ఉత్సాహంగా పాల్గొన్నారు .
previous post