37.2 C
Hyderabad
March 29, 2024 17: 18 PM
Slider నల్గొండ

NSUI నాయకుల అరెస్ట్ అప్రజాస్వామ్యం

#NSUIStudents

విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని గత 50 రోజులుగా విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఎన్ఎస్ యుఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని జాతీయ సోషల్ మీడియా ప్రొబేషనరీ కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ అన్నారు.

కోర్టు ద్వారా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రభుత్వం సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడి చేసిన ఎన్ ఎస్ యు ఐ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని ఆయన అన్నారు.

50 లక్షల విద్యార్థుల జీవితాలతో టి ఆర్ అస్ ప్రభుత్వం చెలగాటమడుతున్నదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థులను, వారి జీవితాలను కేసీఆర్ సర్కారు పూర్తిగా నాశనం చేసిందని ఆయన అన్నారు. విద్యార్థుల తో, యువత తో పెట్టుకున్న ఏ ప్రభుత్వం  ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేదని ఆయన అన్నారు.

విద్యార్థుల ప్రాణాలకై పోరాడుతున్న ఎన్ ఎస్ యు ఐ  నాయకులను ఆరెస్ట్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. అరెస్ట్ చేసిన NSUI రాష్ట్ర కమిటీ  నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మళ్ళీ ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఆయన అన్నారు.

Related posts

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment