27.7 C
Hyderabad
April 25, 2024 07: 28 AM
Slider ప్రత్యేకం

పేరు మార్పు మంచి కాదు: హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉంచాలి

#ashokgajapatiraju

సంత‌కాల ఉద్య‌మంలో టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్య‌డు అశోక్ గ‌జ‌ప‌తి రాజు

ఈ జగన్ ప్రభుత్వం అన్ని రంగాలలో రాజకీయం చేసి..తిరిగి ఎదురు దాడి చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యఃరో సభ్యులు అశోకగజపతి రాజు విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంతకాలు సేకరణ కార్యక్రమంలో అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అదీ భోగాపురం లో ఎయిర్ పోర్ట్, నీటి ప్రాజెక్ట్ లు..నాశనం చేస్తున్నారనన్నారం.

అన్నింటికీ ఎదురు దాడి చేసి… ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పై జగన్ ప్రభుత్వం ఎదురు దాడికి పాల్పడుతోందని అశోక్ ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకు వైఎస్సార్ సిపి కంకణం కట్టు కుందన్నారు. ఎన్టీఆర్ వైద్యానికి చేసిన సేవను దేశం యావత్ అభినందించందని అశోక్ అన్నారు. అలాంటి ఆయన పేరును తీసెయ్యడం..దారుణమని…ఆయన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడారో… దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా…. ఆయన స్పూర్తితో పెట్టి న హెల్త్ యూనివర్సిటీ కి పేరు ను తీసెయ్యడం హేయమైన చర్య అని అశోక్ అన్నారు.

అసలు వికేంద్రీకరణ కు అర్థం జగన్ ప్రభుత్వానికి తెలియదని. కేంద్ర మాజీ మంత్రి విమర్శించారు. అసలు పేరు మార్చి జగన్ ప్రభుత్వం పబ్బం గడుపు కోవడం జరుగుతోందన్నారు. నగరంలో రాజీవ్ స్టేడియం మార్చడంలో ఓ అర్ధం ఉందని అలా కాకుండా పేరు మార్చి అలజడి సృష్ఠిస్తోందని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు దాడి చేసే వారికి ఏం చెప్పాలో అర్థం కాదని ఒక్కడే నాశనం చేస్తున్నారన్నారు.

ఉత్తర కోస్తా లో రుషి కొండ టూరిజం కు వాడెవారని…దాన్నే తొలిగిస్తోందన్నారు. అసలు జనం పై ఎందుకు పడ్డారో అర్థం కాదని.. విశాఖ పై సీఎం జగన్ కు కోపం ఎందుకని విమర్శించారు. విశాఖ రాజధాని గి చేస్తారంట…ఉద్యోఖ అవకాశాలు లేక యువత ఎదురు చూస్తూ ఉంటే…పర్యాటక రంగాన్నే నిర్వీర్యం చేస్తోందన్నారు. శంషాబాద్ ఓ ఉదాహరణ అని..తాజాగా ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్ పోర్టు కు టీడీపీ ప్రభుత్వ హాయాంలో భూముల చిచ్చిన రైతులు ను ఆదుకుందన్నారు.

తాజాగా హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు ఉంచాలని..పార్టీ ఈ సంతకాలు ద్వారా తెలియజేస్తున్నామని ఆశోక్ గజపతిరాజు తెలియజేసారు.వికేంద్రీకరణ అంటే ప్రజలకు అధికారం ఇవ్వడమేనని ఆయన స్పష్టం చేసారు. భాషను వక్రీకరించొద్దని స్పష్ఠీకరణ భాషను వినియోగించాలన అశోక్ అన్నారు.

Related posts

తిరుమల వెంకన్న ను దర్శించుకున్న విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

మార్కెట్ కమిటీల కాలపరిమితి పెంపు

Sub Editor 2

ఉపాధి నిధులను వెనక్కి పంపమనడం సిగ్గుచేటు

Bhavani

Leave a Comment