30.7 C
Hyderabad
April 17, 2024 02: 12 AM
Slider సినిమా

ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

#talasani

ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా దివంగత ఎన్ టీ ఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్  తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ అతిధిగా విచ్చేసారు. ఎఫ్ టి పీ సి అధ్యక్షులు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్ వర్మ పాకలపాటి, అవార్డ్స్ కమిటీ సభ్యులు విశ్వనాధ్, రాంచంద్, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్న ఈ ఆవిష్కరణకు గ్లోబల్ మోడల్ అవార్డు విన్నర్ ఐశ్వర్య రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విశ్వవిఖ్యాత నటులు ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనుండడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఈ సినీ సామాజిక పురస్కార సంబరం ఈ నెల 28 న ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని చైతన్య జంగా –  వీస్ వర్మ పాకలపాటి పేర్కొన్నారు.

Related posts

డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

Sub Editor

విజయశాంతి  రాజకీయ జీవితం ఎంతో మందికి ఆదర్శం

Satyam NEWS

ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత ప్రభుత్వ బాధ్యత

Murali Krishna

Leave a Comment