39.2 C
Hyderabad
March 29, 2024 15: 39 PM
Slider నిజామాబాద్

అవతార పురుషుడు నందమూరి తారకరాముడు

#pocharam

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని నేడు ఆయన శతజయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, జహీరాబాద్ MP బిబీ పాటిల్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ ZP చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, NTR అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ అందరికీ NTR శతజయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలో NT రామారావు కి ప్రత్యేక స్థానం ఉన్నది. రాజకీయం అంటే వ్యాపారం కాదు సేవ చేయడం అని నేర్పింది వారు. ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పింది NTR. నా స్కూల్ రోజులలో వారి ఒక్కో సినిమాను ఆరు సార్లు చూసేవాడిని, NTR వీరాభిమానిని. సినిమాలలో నటించడం కాదు జీవించేవారు. 1949 లో మొదటి సినిమా మనదేశం లో నటించారు. 1978 లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

5 సంవత్సరాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. ఈ పరిస్థితుల్లో తెలుగు జాతిని రక్షించడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. BRS పార్టీలో సగం మంది తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారిమే. దేశంలో సంక్షేమ రంగాలకు ఆద్యుడు NT రామారావు. కూడు, గూడు, గుడ్డ వారి నినాదమే. పక్కా ఇళ్ళ నిర్మాణానికి నాంది పలికింది NT రామారావు. NT రామారావు మార్గదర్శకంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు.

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది. నాన్న గారి గురించి ఎంత మాట్లాడిన తనివి తీరదు. మహా మనిషి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మేవారు. రాయలసీమలో కరువు వచ్చినప్పుడు, కోస్తాలో వరదలు వచ్చినప్పుడు జోలేపట్టి విరాళాలు సేకరించి ప్రజలకు అందించారు. తెలుగు జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్ని యుగాలు గడిచిన, తరాలు మారినా వారి కీర్తి వెలుగుతుంది అని అన్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలంటే నాకు ప్రత్యేకంగా అభిమానం. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి NTR. బ్రతికున్నతంత వరకు ఆ గొప్ప వ్యక్తిని మర్చిపోం. వారి మార్గదర్శనంలో నాటి నుండి నేటి వరకు నిజాయితీగా పని చేస్తున్నాం. మన తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది NTR తోనే.  తెలుగు జాతి తలెత్తుకుంది వారి వలనే. NTR జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు NTR గారి పేరుతోనే జరుగుతుంది. అన్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వారి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాయి అని అన్నారు.

జి లాలయ్య, సత్యం న్యూస్. నెట్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

సుప్రీం చెప్పినా కేసులు ఉపసంహరించుకుంటున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Satyam NEWS

Leave a Comment