కార్మికుల ఆరోగ్య సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర బీజేపీ వ్యవహారాల కో ఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ లోని ESI లో 466 కోట్ల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ నిర్ధారించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన vigilance report no.5 (c.no.1120/ V&E/d1/ 2018) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఇప్పటికి నివేదిక ఇచ్చి ఆరు నెలలు గడిచినా దానిపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ESIలో IMS డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దేవికారాణి అవినీతి బాగోతానికి ప్రధాన సూత్రధారని తెలిసినా ఆవిడపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని నూనె బాల్ రాజ్ ప్రశ్నించారు. ఈ అవినీతి కుంభకోణంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారుల ప్రధాన హస్తం ఉందని, వారి అవినీతి భాగోతం బయటపడుతోందని అందోళనతో దేవికారాణిని కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. 18లక్షల మంది కార్మికులకు సరియైన సమయంలో మందులు అందక చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, సీబీఐ అధికారులు వెంటనే ఈమె పైచర్యలు తీసుకొని అవినీతికి పాల్పడ్డ సొమ్మును రికవరీ చేయించి చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
previous post
next post