కువైట్ లోని ప్రముఖ చైన్ హాస్పిటల్స్ అయిన రాయల్ హోమ్ హెల్త్, నార్కా రూట్స్ ద్వారా మహిళా నర్సులను నియమించనుంది. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉన్న మహిళా బీఎస్సీ / జీఎన్‌ఎం నర్సులకు ఈ అవకాశం ఉంది. మెడికల్ / సర్జికల్, ఎన్‌ఐసియు, మెటర్నిటీ, జెరియాట్రిక్స్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
జీతం సుమారు రూ .75,000 వరకూ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను www.norkaroots.org లో సమర్పించాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. దరఖాస్తు గడువు 31 డిసెంబర్ 2019. మరింత సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 18004253939 (భారతదేశం నుండి) 00918802012345 (విదేశాల నుండి మిస్డ్ కాల్ సర్వీస్) నుండి పొందవచ్చునని కూడా ఆయన తెలిపారు.