కేరళలో జరిగిన ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ పేరుతో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను నగ్నంగా నిలబెట్టారు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో దాదాపు మూడు నెలలుగా ర్యాగింగ్ జరుగుతోందని ఫిర్యాదులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. చిరవకు ముగ్గురు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేసినందుకు ఐదుగురు తృతీయ సంవత్సరం నర్సింగ్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఇక్కడ తెలిపారు. గత నవంబర్‌లో ర్యాగింగ్ మొదలైంది. తమను బలవంతంగా నగ్నంగా నిలబెట్టారని, వెయిట్‌లిఫ్టింగ్ కోసం వాడే డంబెల్స్‌తో అమానుషమైన చర్యలకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని వస్తువులను ఉపయోగించి గాయాలు చేశారని కూడా వారు తెలిపారు. సీనియర్ విద్యార్థులు మద్యం కొనుక్కోవడానికి జూనియర్‌ల నుంచి నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై తరచూ దాడులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేక ముగ్గురు విద్యార్థులు ఎట్టకేలకు కొట్టాయం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
previous post
next post