27.7 C
Hyderabad
April 20, 2024 01: 56 AM
Slider హైదరాబాద్

ఉప్పల్ అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎన్వీఎస్ఎస్ చర్చ

#nitingadkari

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్,  భూసేకరణ పనులను  రాష్ట్ర ప్రభుత్వం కావాలని  వివక్ష చూపిస్తూ నిర్లక్ష్యం చేస్తుందని  తెలంగాణ రాష్ట్ర బి జె పీ ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్  అన్నారు. గురువారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ ని   డిల్లీలోని వారి నివాసంలో  కలిసి తెలంగాణ రాష్ట్రం లోని  పలు పెండింగ్ పనులు పై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్  పనులను వేగవంతం చేసే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు.  భూసేకరణ సంబంధించిన విషయములో భవన యజమానులకు నష్ట పరిహారం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కొంతమందికి ఒక తరహా పరిహారము, మరికొంతమందికి ఇంకొక తరహ పరిహారము ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారి దృష్టికి తీసుకెళ్లారు.

భూమి ఇచ్చిన వారిని తిరిగి భవనాలను నిర్మించుకుంటే జిహెచ్ఎంసి అధికారులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని  వివక్ష చూపిస్తూ నిర్లక్ష్యం చేయడాన్ని కేంద్ర మంత్రి కి ప్రభాకర్  వివరించారు.

కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ఈ అంశాలనే సంబంధిత అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేసి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని ప్రభాకర్ కు  హామీ ఇచ్చారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 

Related posts

జాతీయ సేవారత్న అవార్డును అందుకున్న నేతావత్ సుధాకర్

Bhavani

విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపండి

Satyam NEWS

వి ఎస్ యు గ్రీన్ పార్టనర్ గా SEIL

Satyam NEWS

Leave a Comment