35.2 C
Hyderabad
April 20, 2024 16: 18 PM
Slider జాతీయం

ఓబీసీ కోటా సమాన పునర్విభజన మరింత ఆలశ్యం

#lavukrishnadevarayalu

ఓబీసీల 27శాతం కోటాను సమాన పునర్విభజన కోసం కేంద్రం విధించిన జస్టిస్‌ రోహిణీ కమిషన్‌కు సంబంధించిన వివరాలపై నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని  ప్రశ్నించారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా దేశంలో ఓబీసీల ఉపవర్గీకరణపై రోహిణీ కమిషన్‌ నివేదిక ఆలస్యం అయ్యిందని కేంద్రం బదులిచ్చింది.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ, రోహిణీ కమిషన్‌.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో ఓబీసీల ఉపవర్గీకరణపై సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ వారి నుండి దీన్ని ఎప్పుడు సాధిస్తారన్న విషయంపై నిర్ధిష్ట సమాచారం చెప్పలేదని తెలిపారు.

ఈలోగా ఎలాంటి మధ్యంతర నివేదికను కమిషన్‌ నుండి కోరలేదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జనాభా గణన చట్టం, 1948లో  ఓబీసీ జనాభాను లెక్కించుటపై ఎటువంటి నియమం లేనందు వల్ల హోం మినిస్ట్రీని కూడా ఓబీసీ జనాభాను లెక్కించాలని కోరలేదని మంత్రిత్వ శాఖ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకి లిఖితపూర్వకంగా బదులిచ్చింది.

Related posts

తాగునీటికోసం అలమటిస్తున్నాం చూడండి మహాప్రభో

Satyam NEWS

తీర ప్రాంతంలో విశాఖ రేంజ్ డీఐజీ పర్యటన

Satyam NEWS

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment