దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రవాద ముప్పు ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ హ్చెరికల నేపథ్యంలో తిరుమలకొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. టీటీడీ వినతి మేరకు ఆక్టోపస్ కమాండో బృందాలు రంగంలోకి దిగాయి. కొండపై అణువణువునా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్సు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ భద్రత పెంచారు. అదే విధంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రమయిన తిరుమల లో భద్రత దళాలు అడుగడుగున విస్రృత తనిఖీలు చేస్తున్నాయి. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, దక్షిణాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో తిరుమల తిరుపతికి కూడా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వచ్చాయి. దాంతో మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను అడుగడుగున జల్లెడ పడుతున్నారు. టెర్రరిస్టుల్ని ఎదుర్కోవడంలో కఠోర శిక్షణ పొందిన వీరు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని వినియోగించి సామాన్య భక్తులకు, ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా తిరుమలలో అణవణువున తనిఖీ చేస్తున్నారు.
previous post
next post