Slider పశ్చిమగోదావరి

పెళ్లి మాకు… ఖర్చు మీకు

#cash

ఏలూరు జిల్లాలోని ఏడుకొండల సామి కొలువై ఉన్న మెట్ట మండలం లో ఓ ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారుల తీరుకు గ్రామస్థాయి  ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారుల ఇళ్లలో జరిగే వివాహాది కార్యక్రమాలకు గ్రామస్తాయి ఉద్యోగుల నుoడి ముక్కు పిండి చందాలు వసూలు చేస్తున్నారు.  ఆ శాఖ లో పనిచేసే అధికారి ఇంట్లో జరిగే శుభ కార్యానికి ఆ అధికారి పరిధిలో పనిచేసే ఒక్కొక్క గ్రామస్థాయి ఉద్యోగి నుండి 10,000 వేల రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం.

అంతే కాదు సదరు గ్రామస్తాయి అధికారులు 10,000 రూపాయల చందాలతో బాటు వివాహానికి వచ్చేటప్పుడు స్వీట్లు హాట్ వంటివి కూడా తీసుకుని వివాహం జరిగే క్షీరపురికి తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించడం తో అందినకాడికి అప్పులు చేసి అయ్యవారు అడిగినవన్ని కారుల్లో తీసుకెళ్ళి సమర్పించుకున్నారని మెట్ట మండలం లో పనిచేసే ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

ఈ కార్య క్రమానికి 25 మంది గ్రామ స్థాయి ఉద్యోగులు  మనిషికి 10,000చొప్పున మొత్తం 2లక్షల 50 వేల రూపాయలు సమర్పించుకుని పట్టు మని పది రోజులు కూడా గడవక ముందే అదే శాఖ ప్రధాన కార్యాలయం లో పనిచేసే ఒక అటెండర్ ఇంట్లో జరిగే పెళ్ళికి ఈ సారి ఆ శాఖ ఉన్నతాధికారి గ్రామ స్థాయి అధికారుల ను గ్రేడ్ ల వారిగా విభజించి అటెండర్ ఇంట్లో జరిగే వివాహానికి కూడా మీ మీ ఆర్ధిక సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో బెంబేలెత్తి పోయిన గ్రామస్తాయి ఉద్యోగులు అధికారుల ఆదేశాలకు కక్కలేక మింగలేక సతమతమై పోతున్నట్టు సమాచారం.

ఉద్యోగులు ఇచ్చే ఆర్ధిక సహకారానికి కూడా ఉన్నత అధికారి  ఏప్రియల్ 7వ తేదీ కల్లా మీ మీ ఆర్ధిక సహకారాన్ని అందించాలని డెడ్ లైన్ విధించడం తో ఉద్యోగులు అప్పులు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే మూలిగే నక్కల పై తాటికాయ పడ్డట్టు ఒక సోకాల్డ్ ఊరు పేరు లేని ప్రెస్ రిపోర్టర్ ఒకాయన మండల కేంద్ర పరిదిలో ఉన్న గ్రామ స్తాయి ఉద్యోగుల విధులు నిధుల వినియోగం పై ఆర్ టి ఐ ద్వారా  దరఖాస్తు పెట్టీ సమాధానం ఇస్తారా 10లక్షలు ఇస్తారా అంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడితే ఆ దరఖాస్తుదారునికి 3 లక్షలు చెల్లించడానికి గ్రామ స్థాయి  ఉద్యోగులు తలా ఇoతని వాటాలు వేసుకుని ఆ దరఖాస్తుదారునికి ముడుపులు చెల్లించి ఇన్ని ఒత్తిడులు తట్టుకోలేం సామి అంటూ ఉద్యోగులు ఆసామి కి దండం పెడుతున్నారంట.

Related posts

జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత వైద్యం

Satyam NEWS

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం

Satyam NEWS

నెల్లూరు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అనిల్

Satyam NEWS
error: Content is protected !!