34.2 C
Hyderabad
April 19, 2024 21: 37 PM
Slider ప్రత్యేకం

మంత్రి బొత్సాను బురిడీ కొట్టించిన అధికారులు

#MinisterBotsaSatyanarayana

అధికారుల మాటలు నిజమని నమ్మి ముందుకు వెళితే బొక్కబోర్లా పడతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నది.

సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ నేముగ్గురు ఉన్నతాధికారులు బురిడీ కొట్టించారు. రెండ్రోజుల క్రితం జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో ఆయనకే తప్పుడు నివేదికలు అందించారు.

 800 రైతు భరోసా కేంద్రాలు పురోగతిలో ఉన్నాయంటూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే.. చాలా చోట్ల ఇంకా పనులే ప్రారంభించలేదంటూ ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, మంత్రి బొత్సను, కలెక్టర్‌ను తప్పుదారి పట్టించే విధంగా నివేదికలు అందించారు. వాస్తవ నివేదికలు ఇవ్వడంలో విఫలమయ్యారంటూ పంచాయితీ రాజ్, వ్యవసాయ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు అందాయి.

దీనిపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుల అరెస్ట్

Satyam NEWS

వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

ప్రధాని మోదీ వరంగల్‌ షెడ్యూల్‌

Bhavani

2 comments

Rohit Rishi Muni November 5, 2020 at 10:37 AM

జిల్లా అంటే ఏ జిల్లా అన్నది మెన్షన్ చేయలేదు.బొత్స సత్యనారాయణ జిల్లా అనుకుంటే అది విజియానగరం.కానీ విజయనగరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కాదు. మీరు ఏ జిల్లా నుంచి ఈ వార్త రాసారో తెలియదు.

Reply
Satyam NEWS November 5, 2020 at 4:29 PM

మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లా ఇన్ చార్జి మంత్రి

Reply

Leave a Comment