31.7 C
Hyderabad
April 24, 2024 23: 11 PM
Slider రంగారెడ్డి

రైతు సమస్యలు అర్ధం చేసుకుని పని చేయాలి          

#vikarabad

అధికారులు రైతు స్థానంలో ఉండి వారి సాధక బాధలను అర్థం చేసుకొని పని చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం సేకరణ,  మన ఊరు మనబడి తో పాటు వివిధ అభివృద్ధి కార్యకలాపాలపై సంబంధిత శాఖల అధికారులతో  కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 127 వరి సేకరణ కేంద్రాలను రెండు రోజుల్లో  ధాన్యం సేకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించి మనకు అన్నం పెడుతున్న రైతుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను సమకూర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎఫ్ సి ఐ నిబంధనల మేరకు రైతులకు మంచి ధర వచ్చే విధంగా  కేంద్రాలకు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొని వచ్చే విధంగా రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. వరి సేకరణ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరాల మేరకు అదనంగా  కేంద్రాలను పెంచుకోవాలని సూచించారు. 

కేంద్రాలలో  త్రాగునీరు,  విద్యుత్తు, తూనిక యంత్రాలు, తేమ సూచిక మీటర్లు, తాడిపత్రిలు,  గోనె సంచులను అందుబాటులో ఉంచడంతోపాటు  ఇతర  మౌలిక సౌకర్యాలను సమకూర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.   మండలాల్లో వరి సేకరణ కేంద్రాల పూర్తి బాధ్యతను తహసీల్దారులు నిర్వర్తించాలని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని కలెక్టర్ తాసిల్దార్లను  ఆదేశించారు. తాసిల్దారులు మిల్లర్స్ తో సంప్రదించి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు‌.

జాతీయ ఉపాధి హామీ పనులను వేకవంతంగా చేపట్టేందుకు కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ తెలిపారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఎంపీడీవోలు,  డిఇలు, ఇఇ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో  స్థానిక సర్పంచులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. ఎంపీఓలు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. మే మాసం చాలా కీలకమైందని పెండింగ్ లో ఉన్న పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రెయిన్ అలారం ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి

వర్షం వచ్చే సమయాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా రెయిన్ అలారం ఆప్ డౌన్ లోడ్ చేసుకోవాలని  కలెక్టర్ అధికారులకు సూచించారు.  ఈ యాప్ ద్వారా వారం రోజులు ముందుగానే వర్షసూచనను తెలుసుకోవచ్చని అన్నారు. ముందస్తు వర్ష సూచనను  రైతులకు తెలియజేస్తే వారు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తాసిల్దార్లు,  గిర్ధావర్ లు  ఈ యాప్ ను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ టెలికాన్ఫరెన్స్  లో జెడ్పి సీఈవో జానకి రెడ్డి, డి ఆర్ డి ఓ  కృష్ణన్, డిపిఓ తరుణ్ కుమార్ , డీఈవో రేణుక దేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా మేనేజర్ విమల, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపని తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి విద్య

Satyam NEWS

సెటిల్ మెంట్: స్వామి చెప్పారు ప్రధాన అర్చకుడిని తీసుకున్నారు

Satyam NEWS

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి చదలవాడ అండ

Satyam NEWS

Leave a Comment