ఆఫీసర్లు మన ప్రత్యేక బంట్రోతులు కాదు. అయితే తన అధికారిక పర్యటనకు రాలేదనే కారణంతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిడివో పై చిందులేశారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు మద్దూర్ మండల o లోని బైరాంపల్లి గ్రామంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఆయన బైరాంపల్లి కి వచ్చే సరికి అక్కడ సంబంధిత ఎంపిడివో లేడు. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడివో రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతటితో ఊరుకోలేదు. తన పార్టీకి చెందిన జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డిని సంగతేమిటో కనుక్కోమని చెప్పారు. దాంతో ఆయన ఎంపిడివోకు ఫోన్ చేసి తీవ్రంగా మందలించాడు. మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే TRS పార్టీ కండువాలు కప్పుకుని తిరంగండి అంటూ ఆయన అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో పనులు ఉండి ఎంపి పర్యటనకు రాకపోతే అధికారి టిఆర్ఎస్ వాడనేనా అర్ధం? ఇదే విషయంపై ఇక్కడి అధికారులు అందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి ఈ విధంగా మాట్లాడటం సబబుగా లేదని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
previous post
next post