బిచ్కుంద మండలంలోని బండారెంజల్ గ్రామంలో మండల పరిషత్ అధికారి మహబూబ్ పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న వైకుంఠ ధామ పనులను పరిశీలించిన ఆయన నర్సరి పనులను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరూ కూడా బయటకు రాకుండా రేషన్ బియ్యం కూడా వాలంటర్ల చేత ఇంటింటికి పంపిణీ చేసినందుకు సర్పంచ్ను అభినందించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధికారితో పాటు సర్పంచ్ గడ్డం బాల్రాజ్ పంచాయతీ కార్యదర్శి అనిత మండల సిబ్బంది గంగాధర్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.