34.2 C
Hyderabad
April 23, 2024 11: 50 AM
Slider వరంగల్

కంటివెలుగు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

#kantivelucenters

19వ తారీకు నుంచి ప్రారంభించబోయే కంటి వెలుగు కేంద్రాలను పి ఓ ఐ టి డి ఏ అంకిత్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య ,డిపిఓ వెంకయ్య నేడు తనిఖీ చేశారు. ములుగు జిల్లాలో మొత్తం ఆరు సెంటర్లు ఇందుకోసం ఎంపిక చేశారు. పాలంపేట వెంకటాపూర్ ములుగు చల్బాయి దుంపిల్లగుడం బైయక్క పేట కొండాయి లలో క్యాంప్ సైట్లను ప్రారంభిస్తున్నారు. వైద్య సిబ్బందికి ఎలక్ట్రిసిటీ చైర్స్ టెంట్ వాటర్ ఉన్నవి సదుపాయాలను సమకూర్చాలని గ్రామ పంచాయితీలను ఆదేశించడం జరిగింది.

తర్వాత ఐ టి డి ఎ మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్స్ అందరికీ మరొకసారి కంటి వెలుగు కార్యక్రమం పైన మరియు కంటి సమస్యల పైన డిస్ట్రిక్ట్ క్వాలిటీ టీం డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పిఓ ఐ టి డి ఏ మెడికల్ ఆఫీసర్ ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండవ దఫా కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని టైం కు హాజరుకావాలని ఏమైనా ఇబ్బంది ఉంటే సంప్రదించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ డి పి పాల్గొన్నారు.

Related posts

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల

Satyam NEWS

జాతీయ అవార్డు లలో 30శాతం తెలంగాణకే

Satyam NEWS

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు

Satyam NEWS

Leave a Comment