36.2 C
Hyderabad
April 24, 2024 22: 14 PM
Slider మహబూబ్ నగర్

మల్దకల్ మండలం లో మొదటిసారిగా ఆయిల్పామ్ సాగు

#Oilpalm Plantation

జోగులాంబ గద్వాల జిల్లా లో ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసాచారి తెలిపారు. మంగళవారం మల్దకల్ మండలంలో దామా లక్ష్మన్న అనే రైతు నాలుగెకరాల లో ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభించారు.

నాలుగు ఎకరాలకు 228 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ టీఎస్ ఆయిల్ఫెడ్ సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా అశ్వారావుపేట లోని నర్సరీ నుండి మొక్కలను తెప్పించి రైతులకు అందజేస్తామని ఆయన తెలిపారు.

ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్రం

సబ్సిడీ ఫోను ఒక మొక్కకు రైతులు 27 రూపాయలు చెల్లించాలని ఆయన తెలిపారు. ప్రతి యేటా ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ ను మన రాష్ట్రంలోనే పండించాలి అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

9 మీటర్ల దూరం ఉండేలా మొక్కలను నాటాలని ఆయన సూచించారు. నాలుగు సంవత్సరాలకు వంట వస్తుందని ఎకరాకు 5 టన్నుల ఉత్పత్తి సాధించవచ్చని ఆయన తెలిపారు. టన్నుకు రూ. 8 వేల నుండి 12 వేల వరకు అమ్ముడుపోతుందని అన్నారు. 35 సంవత్సరాల వరకు పంట ఉంటుందని వివరించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 194 ఎకరాలకు అనుమతి లభించగా ఇప్పటివరకు 75 ఎకరాల 28 గుంటలలో మొక్కలు నాటడానికి వచ్చాయని తెలిపారు. ఈ పంట సాగు చేసుకోవడానికి జూలై 15 వరకు గడువు ఉందని ఆసక్తిగల రైతులు ఆయిల్ఫామ్ పంటలను సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్ సుమంత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Related posts

పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

కేటీఆర్ ఐటీ హబ్:వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ

Satyam NEWS

సండే స‌ర‌దాగా.. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

Sub Editor

Leave a Comment