37.2 C
Hyderabad
March 28, 2024 17: 44 PM
Slider ఖమ్మం

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి

#Oil palm

ఖమ్మం జిల్లాలో నిర్దేశిత ఆయిల్ పామ్ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యాన్ని ఏర్పరచినట్లు తెలిపారు.

జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకు గాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతులకు సంబంధించి భూముల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేసినట్లు ఆయన అన్నారు. ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు నీటి వసతి, విద్యుతు సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని ఆయన తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

మండలం వారిగా మండల వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ పంటల సాగుతో లాభాలు, సాగుకు వచ్చే సబ్సిడీ పై పూర్తి స్తాయి లో తెలియ జేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు.

Related posts

భూమిలో నత్రజని స్థిరీకరణకు జీలుగ విత్తనాలు వేయండి

Satyam NEWS

తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట

Satyam NEWS

అల్లోల దివ్యారెడ్డిని అభినందించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

Satyam NEWS

Leave a Comment