27.7 C
Hyderabad
April 25, 2024 07: 42 AM
Slider మెదక్

55 వేల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగుకు ప్రణాళిక

#HarishRao

సిద్దిపేట జిల్లాలో 55 వేల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినందున ఆ మేరకు జలాశయాల ఆయకట్టు పరిధిలో ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫాం సాగుకు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు ఉద్యానవన అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సిద్దిపేట నుండి ఆయిల్ ఫాం సాగు పై ఉద్యానవ కమిషనర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా ఉద్యానవన ఉప సంచాలకులు రామలక్ష్మి, ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, సర్పంచ్ లు, ఎంపిటిసి లు, రైతు బంధు సమితి జిల్లా, మండల, గ్రామ సమన్వయ కర్త లు, పెదవేగి లోని జాతీయ అయిల్ ఫాం పరిశోధన సంస్థ శాస్త్ర వేత్తలు, ఖమ్మం, నల్గొండ ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులు మొత్తం 1600 మంది తో హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంప్రదాయ పంటల సాగు తో పోల్చుకుంటే ఆయిల్ ఫాం సాగు వల్ల రైతులకు అధిక ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. నాలుగేళ్ల నుండి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల పాటు ఆయిల్ పామ్ దిగుబడి ఇస్తుందన్నారు.

అంతర పంటల సాగుకు ఆయిల్ పామ్ అనుకూలం అని మంత్రి తెలిపారు. ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగెకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయ వచ్చునన్నారు.

20 శాతం కార్బన్ పీల్చుకునే ఆయిల్ పామ్ మొక్కలు 22 శాతం ఆక్సిజన్ ను విడుదల చేస్తాయ న్నారు. పర్యావరణపరంగా, రైతుకు లాభాలు అందించేపరంగా ఆయిల్ పామ్ సాగు ఎంతో ఉపయోగం అని మంత్రి తెలిపారు. ఆయిల్ ఫాం సాగు కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయన్నారు.

దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటకు విపరీతమయిన డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో సాగు నీటి సౌకర్యం గణనీయంగా మెరుగైన నేపథ్యంలో రైతులు విస్తృతంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా ఉద్యాన వన అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సూచనతో

ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఇదివరకే ఆయిల్ ఫాం సాగు చేస్తూ లాభాలను గడిస్తు న్న రైతులు తమ విజయగాధలను టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతు బంధు సమితి సభ్యులు, అధికారులకు వివరించారు.

ఆయిల్ పామ్ పంటల సాగుతో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఆయిల్ ఫాం సాగు విధానం, సాగు వల్ల కలిగే ప్రయోజనాలను, మార్కెటింగ్ సౌకర్యం తదితర అంశాలను పెదవేగి జాతీయ అయిల్ ఫాం పరిశోధన సంస్థ శాస్త్ర వేత్తలు వివరించారు.

Related posts

హైదరాబాద్ లో కరోనా కేసుల్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం

Satyam NEWS

కష్టకాలంలో నేతన్నలకు ప్రభుత్వ చేయూత

Satyam NEWS

వలస కూలీ వరస…

Satyam NEWS

Leave a Comment