28.7 C
Hyderabad
April 20, 2024 10: 23 AM
Slider ముఖ్యంశాలు

దళారుల మోసాలు అరికట్టి ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలి

#oilpalmfarmers

ఆయిల్ పామ్ కంపెనీల యాజమాన్యాలు, దళారుల మోసాలు అరికట్టి  ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని, తెలంగాణతో సమానంగా ఆయిల్ పామ్ రైతులకు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు డిమాండ్ చేశారు.

ఆయిల్ పామ్ గెలలు కొనుగోలులో జరుగుతున్న మోసాలపై,ఆయిల్ పామ్ గెలలకు మద్ధతు ధరపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక పవర్ పేట లోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ తోటలు విస్తరించి ఉన్నాయని, ఏటా 10 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణతో సమానంగా ఆయిల్ పామ్ గెలలకు ధర ఇస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

హామీ ప్రకారం 18.68 శాతం రికవరీ పై ధర ఇవ్వాలని జీవో 22ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అయితే తెలంగాణలో టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.21వేలు ధర ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రూ.18 వేలు మాత్రమే ఇవ్వడంతో ఆయిల్ పామ్ రైతులు టన్ను గెలలకు రూ.3వేలకు పైగా నష్టపోతున్నారని చెప్పారు. మరోవైపు గెలలు గ్రేడింగ్ పేరుతో, తూకాలు పేరుతో కంపెనీల యాజమాన్యాలు, దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ ధర పొంది రైతులకు నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. ఆయిల్ పామ్ కంపెనీల యాజమాన్యాలు, దళారుల మోసాలు అరికట్టి ఆయిల్ పామ్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణతో సమానంగా ధర ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆయిల్ పామ్ రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Related posts

రాజకీయ నేపథ్యంలో వస్తున్న సర్కారువారి పాట

Satyam NEWS

వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

భారత్ బంద్ పిలుపు హాస్యాస్పదం: బీజేపీ విమర్శ

Satyam NEWS

Leave a Comment