తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తాజాగా క్యాబ్ డ్రైవర్స్ కూడా సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు సమ్మెకు దిగనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో 50వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. 19 నుంచి సమ్మెకు వెళ్లాలా వద్దా అనే విషయంపై అసోసియేషన్‌లో ఓటింగ్ నిర్వహించగా 75% మంది సమ్మె చేయాలని నిర్ణయించారు. దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఆగస్టు 30న తెలంగాణ రవాణాశాఖకు లేఖ అందించామని అయితే, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాము సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.
previous post