39.2 C
Hyderabad
March 29, 2024 14: 21 PM
Slider జాతీయం

ఎనిమిది రెట్లు పెంపు 2022 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది.

ఇక పాత బైక్‌ల రెన్యువల్‌ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్‌ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్‌ కార్డ్‌ తరహా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది.

Related posts

చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బాసటగా నిలిచిన బ్యాచ్ మేట్స్

Satyam NEWS

ఇక ప్రతీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాత్ర కీలకం

Satyam NEWS

ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ సైరా ట్రైలర్

Satyam NEWS

Leave a Comment