ప్రకాశం జిల్లా అయిన టంగుటూరులో ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయంలో బాలిక తన ఇంట్లో చదువుతూ ఉండగా చాటుగా వచ్చి అత్యాచారం చేయబోయాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.
previous post