34.2 C
Hyderabad
April 23, 2024 12: 18 PM
Slider ఖమ్మం

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

#pensioners

సిపిఎస్ విధానాన్ని  రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య డిమాండ్ చేశారు.  ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా లో మచ్చా రంగయ్య మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని  రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కనీస పెన్షన్ రూ. 12000 చెల్లించాలని,3 డీఏ లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను జాప్యం చేస్తుందని నెల మొదటి తేదీన పెన్షన్ చెల్లించాలని, పి‌ఆర్‌సి  పెండింగు జ.ఓ.లను విడుదల చేయాలన్నారు. భవిష్యత్తులో పోరాటాలకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించనైనది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గోపీచంద్ , కల్యాణం నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, ఝాన్సీ, బందు వెంకటేశ్వరరావు, మాధవరావు, వీరబాబు, టి.యన్. రావు, జనార్ధన్ స్వామి, రాజేంద్రప్రసాద్, రవికుమార్, మధుసూదనరావు, కృష్ణారావు, యేశోబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల ఓవర్ యాక్షన్ తో కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

Satyam NEWS

ఓజో పౌండేషన్ ద్వారా పాఠశాలకు మరమత్తులు

Satyam NEWS

ఆసరా లేని వారికి అనురాగ్ హెల్పింగ్ సొసైటీ సాయం

Satyam NEWS

Leave a Comment