39.2 C
Hyderabad
April 25, 2024 17: 10 PM
Slider విజయనగరం

ల‌య‌న్ ఈజ్ బ్యాక్..కాదు కాదు బాయ‌స్  ఈజ్ బ్యాక్…!

#parvatipuram

న‌ల‌భై ఏళ్ల క్రితం చ‌దువుకున్న టెన్త్  విద్యార్ధుల స‌మ్మేళ‌నం….!

ఈ హెడ్డింగ్ చూసిన వెంట‌నే మీకు…పాత జ్ఙాప‌కాలు గుర్తుకు వ‌చ్చాయా..?  ఈ క్యాప్ష‌న్ చ‌దివిన మీకు…మీ చిన్న‌నాటి  గుర్తులు మ‌దిలో మెలిసాయా..? త‌క్ష‌ణం…మీరు చ‌దువుకున్న రోజులల‌ను ఒక్క‌సారి మ‌న‌నం చేసుకున్నారా..?  నిజ‌మే క‌దండీ…బాల్య నాటి ముచ్చ‌ట్లు..చెర‌గ‌ని తీపి గుర్తులు.అది స‌ర్పించ్ నుంచీ రాష్ట్ర ప‌తి వ‌ర‌కు  ఎవ్వ‌రికైనా. ఇక మేట‌ర్ లోకి వ‌చ్చేస్తున్నా…1982లో ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలో ఆర్సీఎం సెయింట్ జాన్ హైస్కూల్ లో ప‌దో తర‌గ‌తి చ‌దువుకున్న విద్యార్ధులంతా క‌ల‌వ‌బోతున్నారు.

అదే పార్వ‌తీపురంలో  ఈ నెల 27  ల‌య‌న్స్ క్ల‌బ్ లో పూర్వ విద్యార్ధులు  స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా. అందుకు నాందీ ప‌లికారు…మ‌ల్లా వ‌న్ఝుల మ‌ణిశేఖ‌ర్. ప్ర‌స్తుతం పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సీనియ‌ర లాయ‌ర్  ఉంటున్న‌…ఆయ‌న బాల్యం అంతా పార్వ‌తీపురంలోనే కొన‌సాగంది.

లాయ‌ర్  మ‌ణిశేఖ‌ర్  త‌ల్లి  గాయ‌త్రీ దేవి,తండ్రి ఎం.వీ.య‌స్.డీ ప్ర‌సాద‌రావు. లాయ‌ర్ మ‌ణిశేఖ‌ర్ తల్లి గాయ‌త్రీ దేవి…స్త్రీశిశుసంక్షేమ శాఖ లో ప‌ని చేసి..శ్రీకాకుళం,పార్వ‌తీపురం,భ‌ద్ర‌గిరి వంటి గిరిజ‌న ప్రాంతాల‌లో ప‌ని చేసారు.దాంతో అక్క‌డే  విద్యాబ్యాసంపొందిన లాయ‌ర్ మ‌ణిశేఖ‌ర్…పార్వ‌తీపురం స్కూల్లో ప‌దో త‌ర‌గ‌త చ‌దివారు.  1982లో టెన్త్ చ‌దివిన లాయ‌ర్ మ‌ణిశేఖ‌ర్..త‌న బాల్య స్నేహితతుల‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ…పూర్వ విద్యార్ధుల స‌మ్మేళనం ఏర్పాటు చేసారు.

అంతే..సోష‌ల్ మీడియా పుంత‌లు తొక్కుతున్న వేళ‌..స్నేహితులు అంటూ  ఓ గ్రూపు నిర్మించి.. అందులో త‌న బాల్య స్నేహితుల‌ను చేర్చుకుని..వారితో సత్సంబంధాల‌ను కొన‌సాగించ‌డం విశేషం.జీవితం  అనేది ప‌సిప్రాయం నుంచీ చ‌ర‌మాంకం వర‌కు ఓ వినూత్న‌ప్ర‌యాణం.ఇందులో బాల్య‌,య‌వ్వ‌నం,కౌమార ద‌శ‌లు ఉంటాయని ప్ర‌తీ ఒక్కిరికీ  తెలుసు. అందులో బాల్య ద‌శ..జీవిత  చ‌ర‌మాంకంలో తీపి గుర్తుల‌ను మిగుల్తుంద‌ని అంటోంది స‌త్యం న్యూస్.నెట్.

Related posts

శ్రీశైలమల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Satyam NEWS

హెల్ప్ డెస్క్: కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా

Satyam NEWS

గ్రహణ సమయంలో అల్పాహారం.. జనవిజ్ఞాన వేదిక ప్రయోగం..

Satyam NEWS

Leave a Comment