కడప జిల్లా రాయచోటి పట్టణంలో దారుణం జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు వీధి పోరాటానికి దిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ అన్నదమ్ముల పోరాటం చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక లక్ష్మీ ధియేటర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
అన్నదమ్ములు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో తమ్ముడు సిగ్బతుల్లా ఖాన్(35) మరణించాడు. కె.ఆరిఫుల్లా ఖాన్(45) పరిస్థితి సీరియస్ గా ఉంది. అతడిని వెంటనే తిరుపతి కి తరలించారు. ఈ అన్నదమ్ముల మధ్య దాడికి ఆస్తి తగాదాలే కారణమంటున్నారు.