35.2 C
Hyderabad
April 24, 2024 12: 34 PM
Slider శ్రీకాకుళం

అడిగే వాడే లేడు: శ్రీకాకుళం జిల్లాలో పురాతన దేవాలయాల కూల్చివేత….

#srikakulamdist

ఎంతో పవిత్రమైన దేవాలయాలు….. అందరికి ఆరాధ్య దైవమైన శ్రీ ఆంజనేయుడు…. శ్రీ వినాయకుడు…. పురాతనమైన దేవాలయాలలో కొలువై ఉన్న ఈ స్వాములు ఇప్పుడు లేరు…. మాయం అయిపోలేదు… కూల్చివేశారు… విగ్రహాలను విరగ్గొట్టేశారు….. శ్రీకాకుళం జిల్లాలో ఈ దారుణమైన సంఘటనలు జరిగాయి.

ఎవరికి తెలియలేదు…. ఎవరూ నిరసనలు వ్యక్తం చేయలేదు. కొందరు బద్వేల్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారు… మరి కొందరు పార్టీ కార్యాలయం ధ్వంసం అయిన ఆవేదనలో ఉన్నారు….. మరి కొందరు ప్రత్యర్థులను బూతులు ఎలా తిట్టాలా, వారిని ఎలా అరెస్టు చేయాలా అని ఆలోచిస్తున్నారు….. దేవుళ్లు మాత్రం మనుషుల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ట్రాక్ పై ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, అదే ప్రాంగణంలో ఉన్న వినాయకుడి దేవాలయాన్ని నేల మట్టం చేసేశారు.

నరసన్న పేట నుంచి ఒడిశా లోని మోహన ప్రాంతం వరకూ నిర్మిస్తున్న 326(ఏ) హైవే విస్తరణ పనుల్లో భాగంగా ఈ దేవాలయాలను కూలగొట్టేశారు. విగ్రహాలను తరలించుకునే సమయం కూడా ఇవ్వలేదు. విరగ్గొట్టేశారు….. ఈ రెండు దేవాలయాలే కాదు….ఉత్కలాంధుల ఆరాధ్య దైవం అయిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహారీతో బాటు ముందున్న సింహద్వారాన్ని కూడా కూల్చేశారు. రహదారుల విస్తరణ పనుల్లో ఇలా ప్రాచీన ఆలయాలను నేల మట్టం చేయడం దారుణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్

Satyam NEWS

దొడ్డి కొమురయ్య కు సీఎం కేసీఆర్ నివాళి

Satyam NEWS

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment