28.2 C
Hyderabad
January 21, 2022 16: 34 PM
Slider ప్రపంచం

డెల్టాను ఓమిక్రాన్ దాటేస్తుంది డబ్ల్యూహెచ్ఓ

రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. ఓమిక్రాన్ త్వరగా డెల్టా వేరియంట్‌ను దాటేస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4,868 ఓమిక్రాన్ కేసు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో రోజుకు 1 కోటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ కేసులతోపాటు కోవిడ్ సంఖ్యలలో కూడా బాగా పెరుగుదల కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా కాకుండా భారతదేశంలో కూడా పెరుగుతోంది.

 WHO విడుదల చేసిన COVID-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్ ప్రకారం… జనవరి 3-9 వారంలో ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్లకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారంతో పోలిస్తే 55 శాతం పెరిగిందని వెల్లడించింది.

సుమారు 9.5 మిలియన్ కేసులు నమోదైనట్లుగా తాజా  నివేదికలో వెల్లడించింది. WHO తాజా అప్ డేట్ ప్రకారం ఓమిక్రాన్  వేరియంట్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఇతర వేరియంట్‌ల కంటే వేగంగా విస్తరిస్తోందని తెలిపింది.

Related posts

మావోయిస్టు సుదర్శన్‌ కూడా లొంగిపోతాడా?

Satyam NEWS

27న భారత్ బంద్ కు నవతరం పార్టీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Farmers day : నేలకొరుగుతున్న అన్నదాతలు ఎందరో

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!