32.2 C
Hyderabad
April 20, 2024 21: 27 PM
Slider జాతీయం

19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. 70 కొత్త కేసులు

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 492కి పెరిగింది. కేరళలో 19 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57కి చేరుకుంది. వీటిలో ఎర్నాకులంలో 11, తిరువనంతపురంలో 6, త్రిసూర్, కన్నూర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో 31 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌తో సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో 141 కి పెరిగింది. ముంబైలో 27 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అలాగే ఈ కేసుల సంఖ్య 73కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో తొలిసారిగా 9 ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు నమోదయ్యాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో ‎ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6కి పెరిగింది. హర్యానాలో ఒమిక్రాన్ మరొక కేసు కూడా వెలుగుచూసింది. దీని కారణంగా కొత్త వేరియంట్‌ సోకిన వారి సంఖ్య 10కి పెరిగింది. తెలంగాణలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Related posts

హానర్: దొరస్వామి రెడ్డికి ఆత్మీయ సత్కారం

Satyam NEWS

తైక్వాండో పోటీలు విజయవంతం చేయండి

Satyam NEWS

T20 ప్రపంచ ఛాంపియన్ గా ఇంగ్లాండ్

Satyam NEWS

Leave a Comment