28.7 C
Hyderabad
April 20, 2024 03: 25 AM
Slider జాతీయం తెలంగాణ

22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె

PUBLIC-SECTOR-BANKS-INDIA

జాతీయ బ్యాంక్ ల విలీనాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాంబాబు తెలిపారు. హిమాయత్ నగర్ లోని కామ్రేడ్ సత్యనారాయణ భవన్ లో నేడు ​తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ ​​సమావేశంలో​ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ​ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల ​ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్ లు గా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను తీవ్రంగా నిరసిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ​అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు ​బ్యాంక్ ల​ సమ్మె చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల విలీనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తిరోగామి చర్యగా ఆయన అభివర్ణించారు. 10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే  ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందని, ​ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలీనాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ చర్యతో ​గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుందని ఆయన తెలిపారు. ​బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారని దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుందని ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం ​బ్యాంక్ ల సంస్కరణల పేరుతో కార్పొరేట్ లకు దగ్గర అవుతుందని ఆయన ఆరోపించారు

Related posts

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ కు పెట్టుబడుల వెల్లువ

Bhavani

పల్లెప్రగతి అమలుతో అభివృద్ధి పథంలో గ్రామాలు

Satyam NEWS

మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

Leave a Comment