27.7 C
Hyderabad
April 24, 2024 08: 59 AM
Slider ఆదిలాబాద్

పెంచికల్ పేట లో ఇక రెవెన్యూ ఫిర్యాదులు ఆన్ లైన్ లో

#Penchikal Pet

తహశీల్దార్ కార్యాలయం లో ఎలాంటి పనులు ఉన్నా ఆన్ అన్ లో చేసుకోవచ్చునని పెంచికల్ పేట్ మండలం తహసీల్దార్ వెల్లడించారు. కరోనా వైరస్ వేగం గా వ్యాప్తి చెందుతున్న కారణంగా కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

రెవెన్యూ పరమైన భూ సమస్యలు, ఇతర సమస్యలు ఏమి ఉన్నా దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయం పెంచికల్ పేట్ మెయిల్ అడ్రెస్ mro.penchikalpet@gmail.com కు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల చరవాణి కి విజ్ఞప్తులను Whats App ద్వారా పంపవచ్చు.

ఒకవేళ అత్యవసర సమస్యలు ఉంటే కార్యాలయంలో ఫిర్యాదుల డబ్బా ఏర్పాటు చేశామని, మీ దరఖాస్తులో మీ ఫోన్ నెం. రాసి ఫిర్యాదుల డబ్బాలో వేస్తే దాన్ని పరిశీలన లోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలందరూ అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావద్దని తప్పనిసరి పరిస్థితులలో బయటికి వచ్చినపుడు మస్కూలు తప్పకుండా ధరించాలని ఆయన కోరారు.

భౌతిక దూరం నిబంధనలను పాటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఆయన కోరారు. Whats app  నెంబర్  6281980224  ద్వారా సమాచారాన్ని పొందవచ్చునని ఆయన అన్నారు.

Related posts

మీ ఎం.ఎల్.ఏ లు ఎంత తింటున్నారో చెప్పాలా?

Satyam NEWS

7న మేడారం జాతరకు వెళ్తున్న సిఎం కేసీఆర్

Satyam NEWS

అస్తి, చెత్త పన్ను భారం రద్దుచేయాలంటూ సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment