27.7 C
Hyderabad
April 20, 2024 01: 05 AM
Slider ఆధ్యాత్మికం

ద్వారకా తిరుమలలో ఇక నుంచి ఆన్ లైన్ సేవలు

#dwaraka tirumala

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా  ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ( చిన్నతిరుపతి) ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

స్వామివారి దగ్గరకు నేరుగా రాలేని భక్తులు స్వామివారి దర్శనాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పొందవచ్చు. అందుకోసం tms.ap.gov.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దేవస్థానం ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రధాన పుణ్య క్షేత్రాలతో పాటు  ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సేవలను కూడా ఆన్ లైన్ లో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి  గురికాకుండా ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు పొందవచ్చు.

దేవస్థానం లో విధులు నిర్వహించే ప్రతి సిబ్బందికి అవగాహనా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని ఈ ఓ సుబ్బా రెడ్డి అన్నారు. ఈ శిక్షణా తరగతులు జూన్ 9 అనగా బుధవారం నుండి శుక్రవారం అనగా జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే స్వామివారి హుండీలో కానుకలు వేయాలనుకునే భక్తులు స్వామివారి సన్నిధికి రాలేనివారు ఈ హుండీ సౌకర్యాన్ని కూడా కల్పించారని ఈ ఓ  ఈ శిక్షణా తరగతులలో సిబ్బందికి  వివరించారు.

ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్న సిబ్బందికి కంప్యూటర్ నాలెడ్జ్ ఈజీగా అర్థమయ్యేలా  దేవస్థాన టెక్నికల్ బృందం శిక్షణ ఇచ్చారని అన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి డిప్యూటీ ఈఓ.ఏ ఈ ఓ లు పర్యవేక్షకులుగా వ్యవహరించగా డి వై ఈ ఈ లు తదితర సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Related posts

డిసెంబర్ 31 రాత్రికి వచ్చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్

Satyam NEWS

“మిస్ సౌత్ ఇండియా” రేసులో హైదరాబాద్ అమ్మాయి

Satyam NEWS

శాల్యూట్ డాడీ: నాన్నకు ప్రేమతో…..:

Satyam NEWS

Leave a Comment