21.2 C
Hyderabad
December 11, 2024 21: 02 PM
Slider ముఖ్యంశాలు

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశం

#chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. డిజిటల్ కామర్స్ మార్కెట్  ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. ఆయా ఉత్పత్తులను డిజిటల్ కామర్స్, మార్కెట్ అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC యొక్క ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడంపై చర్చించారు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇ-కామర్స్‌ ద్వారా కొనుగోలుదారులు, విక్రేతలు సులభంగా అనుసంధానం అయ్యేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనిలో భాగంగా హార్టికల్చర్, ఆక్వా తదితర రంగాల ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు సాగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.

Related posts

మారువేషాల్లో విజయవాడకు అంగన్వాడీలు

Bhavani

బిచ్కుందలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

జర్నలిస్టులకు బియ్యం, పెట్రోలు అందించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment