27.7 C
Hyderabad
April 26, 2024 05: 21 AM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు ఇంటి బందోబస్తు పోలీసుకు కరోనా

#Chandrababu House

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడి నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద అతను బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాడు.

బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ లో పనిచేసే ఇతను, మే 5న విధుల్లో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. దాదాపు నెల రోజుల పాటు చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పని చేసి, ఈ నెల 7న తిరిగి బాపట్లకు వచ్చాడు. ఆపై అనారోగ్యం బారిన పడగా, కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు మూడు రోజుల క్రితం నమూనాలు సేకరించారు.

ఫలితాల్లో ఇతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. హైదరాబాద్ లో పని చేస్తున్న సమయంలో తోటి కానిస్టేబుల్ నుంచి ఇతనికి వైరస్ వ్యాపించినట్టు సమాచారం. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.

Related posts

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

Satyam NEWS

Tragedy TDP: తొక్కిసలాటలో ముగ్గురు మృతి

Satyam NEWS

జులై 22న ‘మీలో ఒకడు’ చిత్రం గ్రాండ్  రిలీజ్

Satyam NEWS

Leave a Comment