27.7 C
Hyderabad
April 24, 2024 07: 54 AM
Slider అనంతపురం

మాస్కులు కుట్టినందుకు కోటి రూపాయల చెక్కు

#Dy.CM Allanani

మాస్కులు కుట్టినందుకు రూ. 1,05,18,487 గ్రాండ్ చెక్కును రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కరోనా బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ మనిషికి 3 మాస్కులు పంపిణీ చేయడంలో సహకరించిన 382 స్వయం సహాయక సంఘాల టైలర్లుకు ఇది అందించారు.

 అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణం నుండి కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్న బాధితులతో ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, రహదారులు & భవనాలు శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎంపీ లు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసనసభసభ్యులు అనంత వేంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శ్రీదర్ రెడ్డి, పివి సిధార్థ రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

 JNTU, PVKK  కోవిడ్ కేర్ సెంటర్లు,  KIMS SAVEERA , RDT, Bathalapalli  కోవిడ్ ఆస్పత్రులోని పాజిటివ్ వ్యక్తులతో ఆహారం, పారిశుద్ధ్యం వైద్య సేవలందించడంపై ఆరా తీశారు. ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అన్నీ చాలాబాగున్నాయన్న పాజిటివ్ వ్యక్తులు తెలిపారు.

ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని, ఆహారం విషయంలో కానీ, వైద్య సేవలు సరిగా అందుతున్నాయి లేదా అనే విషయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీ లేకుండా ఉండాలని సూచించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రోజుకు ఫుడ్ కోసం రూ. 500 ఇస్తోంది.. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా చెప్పండి.. అందిస్తున్న సేవలు సరిగా లేకపోతే సరిచేస్తామని వారు అన్నారు.

Related posts

మానస్ నాగులపల్లి నటించిన క్షీరసాగర మథనం చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం మూడు లాంత‌ర్ల జంక్ష‌న్ నుంచి హెరిటేజ్ వాక్

Satyam NEWS

మోడీని విమర్శల్లో ముంచెత్తున్న విదేశీ మీడియా

Satyam NEWS

Leave a Comment