37.2 C
Hyderabad
March 28, 2024 18: 40 PM
Slider ముఖ్యంశాలు

కరోనాతో సింహాచలం దేవస్థానం ఉద్యోగి మరణం

#Simhachalam

సింహాచలం దేవస్థానంలో కరోనాతో ఒక ఉద్యోగి మరణించిన విషయం వాస్తవమేనని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి M.V. సూర్యకళ తెలిపారు.

అయితే మరణించిన ఉద్యోగి 17వ తేదీ నుంచి సెలవులో ఉన్నారని, 24వ తేదీన మరణించారని అందువల్ల కచ్చితంగా కోవిడ్ వల్లే ఆయన చనిపోయారని చెప్పలేమని అన్నారు.

కొన్ని లక్షణాల వల్ల కోవిడ్ వల్లే చనిపోయుండొచ్చని భావిస్తున్నామని ఆమె తెలిపారు. కరోనా నేపథ్యంలో దేవస్థానంలో 25 మందికి టెస్టులు చేయించామని, ఇద్దరికి మాత్రమే కోవిడ్ -19 పాజిటివ్ గా వచ్చిందని ఆమె తెలిపారు.

కొండపైన ఆరుగురి వరకు కోవిడ్ వచ్చినట్లు సమాచారం ఉందని ఆమె తెలిపారు. ఆలయంలోపల, బయట మొత్తం శానిటైజేషన్ చేస్తున్నామని, మాస్కులేని భక్తులను అనుమతించడం లేదని ఆమె తెలిపారు.

భక్తులు కచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలని తాము శానిటైజర్ అందిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నామని, భక్తులకు మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరి అని ఆమె తెలిపారు.

గంటకు 2 వేల మందికన్నా ఎక్కువ మందికి అనుమతి లేదు. దాని ప్రకారమే టికెట్లు ఇస్తున్నాం అని ఆమె తెలిపారు.

Related posts

నేరాన్ని బయటపెట్టిన గూగుల్ ఎర్త్

Satyam NEWS

విజయనగరం లో కొనసాగుతున్న బంద్..!

Satyam NEWS

పులివెందులలో జగన్ కు ఎదురు దెబ్బ?

Satyam NEWS

Leave a Comment